We Organizing
The Dias of Compassion & Alternative Healing Arts;
The Center for Dr. Bach Flower Remedies , Master EK Homoeopathic service center,
Acupuncture (Indian & Chinees) / Acupressure Association , Mangala Giri,
at the foot step of Mount Mangala (MangalaGiri)
between twin cities Guntur and Vijayawada of AndhraPradesh.
అద్భుత బాచ్ ఫ్లవర్ రెమేడిస్ :
'సాహసం చేయరా' అన్న పాతాళభైరవి మాంత్రికుదిలాగా 'ఆడే సపరే'(డేర్ టు బి వైస్ ) అనే రెండే రెండు చిన్న జర్మన్ పదాలతో వైద్యరంగాన్నే ఉత్తేజ పరచిన ఆ జర్మన్ వైద్య మాంత్రికుడు డా. శా మ్మ్యేల్ హానెమన్ బాటలో ''రోగే అతని స్వస్థతలోని అతిముఖ్య అంశమని, రోగగ్రస్త శరీరాన్ని గాక రోగిని స్వస్తపర్చడమే వైద్యరంగ ఆదర్శమని'' విశ్వసించి సాగించిన అన్వేషణలో డా. బాచ్ తన ౩౮ ఫ్లవర్ రెమిడీలను ఆవిష్కరించాడు.
సరళత్వమే అతని కీలక పదము. వైద్యం అతి సరళంగా ఉండాలన్న ఆకాంక్షతో మొదట ''12 హీలర్స్'' నీ, తర్వాత మిగతా 27 ఫ్లవర్ రెమిడీలను ప్రకటించాడు. మొత్తం 38 రెమిడీలను 7 బృందాలుగా విభజించాడు.
1 . భయం (రాక్ రోస్, మిములస్, చెర్రిప్లం, ఆస్పెన్, రెడ్ చెస్ట్ నట్,);
2 . అనిచ్చయత (సెరాటో, స్కెలరాన్తస్ , జేన్షియన్, గార్స్, హార్నబీం, వైల్డ్ వోట్స్ );
3 . ప్రస్తుత పరిస్థితులపై సరైన ధ్యాస లేకుండుట (క్లేమటిస్, హనిసకిల్ , వైల్డ్ రోస్ , ఆలివ్, వైట్ చెస్ట్ నట్, మస్టర్డ్,
చెస్ట్ నట్ బడ్)
4 . ఒంటరితనం (వాటర్ వయొలెట్, ఇమ్పెషన్స్, హీథర్);
5 . ప్రభావకాలకు, మరియు భావాలకు అతి సున్నితత్వం (అగ్రిమోని, సెంటారీ, వాల్నట్, హాలి);
6 . ఆశని కోల్పోవుట (లార్చ్, పైన్, ఎల్మ్, స్వీట్ చెస్ట్ నట్, స్టార్ ఆఫ్ బెతల్హాం, విల్లో, ఓక్, క్రాబ్ ఆపీల్);
7 . ఇతరుల సంక్షేమం కొరకు అతి జాగ్రత్త (చికొరీ, వెర్ వైన్ , వైన్ , బీచ్, రాక్ వాటర్).
అలాగే, మానవాళి దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్నిరకాల ఎమర్జెన్సి లకు రేమిడీగా 5 పుష్ప రెమిడీలను ( స్టార్ ఆఫ్ బెతల్హాం, రాక్ రోస్, ఇమ్పెషన్స్, చెర్రిప్లం, క్లేమటిస్) కలిపి ''రేస్క్యురేమిడి సమ్మేళనం'' గా అందించాడు. ప్రాణభయం, షాక్, మానసిక తిమ్మిరి, మొదలగు వాటిని కలిగివుండే అత్యవసర పరిస్థితుల్లో ఇది అత్యద్భుత ఫలితాల్ని ఇస్తున్నది. విమాన ప్రయాణాలు(ఫ్లయింగ్), దంతవైద్యుని కలవడం, పరీక్షలు వ్రాయడం, ముఖ్యమైన ఇంటర్వ్యూకి వెళ్లేముందు రేస్క్యురేమిడి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. కనుకనే దీనిని ''ఆల్రౌండ్ క్రైసిస్ రేమిడి'' అంటారు.
మానవజాతి ఉన్నంతవరకు మార్పు చెందని ఈ దివ్య పుష్పాల పనితీరుని బట్టి డా. బాచ్ ఈ విధానాన్ని ''ఎటర్నల్ సిస్టం'' అనీ, ఈ పుష్పాలను భవిష్యత్తులో ప్రజలంతా సరళంగా వాడుకొనే ''ఫ్యూచర్ రేమేడిలు'' అనీ అభివర్ణించాడు. డా. బాచ్ వ్రాసిన చిన్నపుస్తకం ''హీల్ థైసెల్ఫ్'' లోని 'ఎటర్నల్ ట్రూత్' నందలి మధ్య పేరా "టేక్ నో నోటీస్ ఆఫ్ ది డిస్ఈస్, థింక్ ఓన్లీ ది అవుట్ లుక్ ఆఫ్ లైఫ్ ఆఫ్ వన్ ఇన్ డిస్ట్రెస్," అనేది ఈ విధానపు మూలసూత్రంగా నిలిచినది.
ప్రజలందరికి అతి సరళంగా ఆరోగ్యాన్ని అందించే ఈ విధానాన్ని "పీలింగ్ ఆఫ్ ఆనియన్ మెథడ్" అనికూడా డా. బాచ్ పిలిచేవాడు. పంచకోశయుతమైన మానవ శరీరంలో వొక్కొక్క పొరలో పేరుకొని ఉన్న నెగెటివ్ నెస్ క్రమంగా పాజిటివ్ నెస్ గా మారిపోతు స్వస్తతని అందిస్తుంది.
రండి! డా. బాచ్ మిషన్ లో పాల్గొందాం!!
38 రెమిడీల్లో మన టైపు రేమిడిలు ఏవో తెలుసుకొందాం !!!
దీర్గ వ్యాధుల నుండి, టెర్మినల్ ఇల్నెసేస్ నుండి, చిత్ర విచిత్ర భావోద్వేగాలు-మానసిక సంచలనాల నుండి మనల్ని మనం రక్షించుకొందాం రండి!!!
*******************************************************************************************************************************************************************************